విశాఖ ఎంపీ MVVకి జనసేన నేత వార్నింగ్‌..ఇంటికొచ్చి కొడతానంటూ !

-

విశాఖ ఎంపీ MVV సత్యనారాయణకు జనసేన నేత  వంశీ కృష్ణ వార్నింగ్‌ ఇచ్చారు. తన పట్ల ఎం వి వి వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అవసరం అయితే.. ఇంటికొచ్చి కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు జనసేన నేత వంశీ కృష్ణ. ముఖ్యమంత్రి జగన్ కూడా విశాఖ ఎంపీని కాపాడలేడంటూ వ్యాఖ్యలు చేశారు.

Vamsi Krishna Srinivas Comments on Vizag MP MVV Satyanarayana

ఎంవివికి సంబంధించిన అనేక వ్యక్తిగత వ్యవహారాల ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. అయితే… వంశీ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు ఎంపీ ఎంవీవీ. అనంతరం జనసేన నేత ఎమ్మెల్సీ వంశీ కృష్ణపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎంవీవీ. తన ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా ఇంటికి వచ్చి కొడతానంటూ వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఎంవీవీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version