జగన్‌ సమక్షంలో YCPలో చేరిన వంగవీటి నరేంద్ర

-

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేత చేరారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రాధా–రంగా మిత్రమండలి ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర చేరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా–రంగా మిత్రమండలి సభ్యులు షేక్‌ బాబు, ఇమ్రాన్‌ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబానికి, వంగవీటి కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి అన్నారు. రాధా చేసిన తప్పు నేను చేయకూడదనే వైఎస్సార్సీపీలో చేరానని… బీజేపీ- జనసేన-టీడీపీ కూటమి పూర్తిగా అనైతికం అని తెలిపారు.
కూటమి ప్రజల కోసం కాదు.. వారి స్వార్థం కోసం ఏర్పడింది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version