నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని… కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందన్నారు. పార్టీ పూర్తిగా పోయిందని, టిడిపికి భవిష్యత్తు లేదన్న వారందరికీ లోకేష్ యువ గళంతో సమాధానం చెప్పారని వెల్లడించారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని.. లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారని… అలాంటిది పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తలకు ధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి? అంటూ నిలదీశారు. కరుడుగట్టిన టిడిపి కార్యకర్తగా లోకేష్ ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నా అన్నారు వర్మ. ఇది నా ఒక్క అభిప్రాయం కాదు.. టిడిపి కార్యకర్తల మనసులో మాట అని తెలిపారు. ఏదేమైనా అధినేత తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యం అని చెప్పారు.