తిరుమలలో వేరే మతస్తులతో ఉద్యోగాలు చేయించకూడదు : వాసుదేవానందగిరి స్వామీజీ

-

తిరుమల శ్రీవారి సన్నిధిలో వేరే మతస్తులతో ఉద్యోగాలు చేయించకూడదు అని శ్రీ విద్యా పీఠాధిపతులు వాసుదేవానందగిరి స్వామీజీ అన్నారు. తిరుమల లడ్డూ ఘటన తర్వాత అన్ని దేవాలయాలపై భక్తులకు విశ్వాసం తగ్గింది ఏ ప్రసాదంలో ఏం వుందో తెలియక భక్తులు అయోమయం చెందుతున్నారు. దీనికి కారణమైన వారిని న్యాయస్థానాల ముందు నిలబెట్టాలి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని దేశంలోని అన్ని ల్యాబ్ లు చెప్పాయి. ల్యాబ్ రిపోర్టులనే తప్పు అంటే ఇంతకంటే అవివేకం మరొకటి ఉండదు అని పేర్కొన్నారు.

ఇక గత ప్రభుత్వంలో అన్యమస్తులకు దేవాలయాల్లో పదవులు ఇవ్వకూడదని తాము న్యాయస్థానాల్లో కేసులు వేశాము. గత ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టీ మా నోరు నొక్కింది. టీటీడీలో ఇలా అధర్మం చేసినా అధికారి కుమారుడే చనిపోయాడు. తిరుమల లడ్డూ నాణ్యతను నాశనం చేసిన వారికి తగిన శిక్ష పడాలి . సీబీఐ చేత విచారణ చేయించాలి. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని స్వామిజి కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version