AP: నేడు వీర జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు

-

వీర జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు ఇవాళ జరుగనున్నాయి. నేడు ఉదయం 9 గంటలకు వీర జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిన్న రాత్రి 10 గంటలకు అనంతపురం జిల్లా నార్పలకు సుబ్బయ్య పార్థివ దేహం చేరుకుంది. సుబ్బయ్య సొంతూరు ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామం అన్న సంగతి తెలిసిందే. అనంత జిల్లా నార్పలలో పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వీర జవాన్ సుబ్బయ్య.

Veera Jawan Subbaiahs last rites today at 9 am

ఇక వీర జవాన్ సుబ్బయ్యకు భార్య లీల, కుమార్తె లాస్య ప్రియ, కుమారుడు సాయి ఉన్నారు. అయితే..వీర జవాన్ సుబ్బయ్య మృతి నేపథ్యంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. వీర జవాన్ సుబ్బయ్య సొంత తోటలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news