రక్తాభిషేకాలు కాదు…బుద్దా వెంకన్న కిడ్నీలు అమ్మినా ప్రయోజనం లేదు – వెల్లంపల్లి

-

రక్తాభిషేకాలు కాదు…బుద్దా వెంకన్న కిడ్నీలు అమ్మినా ప్రయోజనం లేదంటూ ఎద్దేవా చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్. బుద్ధా, బోండాలపై వెలంపల్లి షాకింగ్‌ కామెంట్స్ చేశారు వెలంపల్లి శ్రీనివాస్. బోండా ఉమా ప్రజల్లో లేని వ్యక్తి అని…సూర్యుని, చంద్రుని చూడలేని వ్యక్తి బోండా ఉమ అంటూ ఆగ్రహించారు. వెల్లంపల్లి శ్రీనును భయపెట్టడం నీవల్ల నీ బాబు వల్ల కూడా కాదు….చంద్రబాబు, లోకేష్ కే నేను భయపడను నువ్వు ఎంత అంటూ ఛాలెంజ్‌ చేశారు.

vellam palli counter to budda venkanna

బోండా ఉమ మా కార్యకర్తలను టచ్ చేసి చూడు నీ సంగతి ఏంటో చూస్తానని…బోండా ఉమ అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. నారా లోకేష్ లాగా పారిపోయే సైన్యం కాదు….బోండా ఉమా చేసిన అవినీతి, కబ్జా, బైక్ రేసింగ్లు ప్రజలందరికీ తెలుసు అని వివరించారు వెలంపల్లి శ్రీనివాస్. చంద్రబాబుకు పిచ్చి వచ్చినట్లు.. బోండా ఉమ కు పిచ్చి వచ్చిందని ఎద్దేవా చేశారు వెలంపల్లి శ్రీనివాస్. బుద్దా వెంకన్న పిచ్చి పట్టి రక్తాభిషేకాలు, కిడ్నీలు అమ్మినా ప్రయోజనము లేదు..బుద్దా వెంకన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version