ఆంధ్ర రాజకీయాల్లో అవగాహన లేని వ్యక్తి రజనీకాంత్ – వెల్లంపల్లి శ్రీనివాస్

-

రజనీకాంత్ సినిమాల్లో సూపర్ స్టార్ అని.. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అవగాహన లేని వ్యక్తి రజనీకాంత్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు రజనీకాంత్ కూడా చంద్రబాబుతో చేతులు కలిపాడన్న విషయం అందరికీ తెలుసు అని..అటువంటి వ్యక్తి వచ్చి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పిస్తాననటం ఆశ్చర్యంగా ఉందని వివరించారు.

విజన్ 2047 అంటే ఏంటో నాకు అర్దం కాలేదని.. తలైవీ సినిమాల్లో కోట్లు సంపాదిస్తాడు కాబట్టి ఆయనకు ఇబ్బంది లేదన్నారు. కేసీఆర్ కట్టినట్లు ఎందుకు శాశ్వత సచివాలయం కట్టలేకపోయాడు చంద్రబాబు అని.. గత ఎన్నికల సమయంలో గరుడా శివాజీ రాలేదా అని నిలదీశారు. రజనీకాంత్ వాస్తవాలు తెలుసుకోవాలని.. సినిమా యాక్టర్లు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్ళతారన్నారు. ప్రజలకు అవగాహన ఉండటంతోనే గత ఎన్నికల్లో 23 స్థానాలకు చంద్రబాబును పరిమితం చేశారు.. సింగల్ గా పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి జగన్ అని కొనియాడారు.నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా తిట్టిన చంద్రబాబు విజన్ ఇప్పుడు మారిపోయిందా ? అని ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version