వైద్య శాఖలో ఖాళీల భ‌ర్తీకి చ‌ర్య‌లు – విడదల రజినీ

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే గొప్ప వైద్య సంస్థ‌గా విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (విమ్స్‌) ను అభివృద్ధి చేస్తామ‌ని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. స్థానిక విమ్స్ ను శుక్రవారం మంత్రి విడ‌ద‌ల ర‌జిని సంద‌ర్శించారు. వార్డుల్లో క‌లియ‌తిరుగుతూ రోగుల‌తో ఆప్యాయంగా మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరు, మందుల పంపిణీపై ఆరా తీశారు. భోజ‌న స‌దుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందుతున్న తీరుపై రోగులు సంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఆసుపత్రిలోని అత్య‌వ‌స‌ర వైద్య విభాగం, ఐసీయూ వార్డులను తనిఖీ చేశారు. అనంత‌రం నేరుగా రోగులతో సంభాషించారు. ఆరోగ్యశ్రీ, ఐసీయూ, జనరల్‌ సర్జరీ, న్యూరో, ఫిజియోధెరపీ ఇతర విభాగాలను సంద‌ర్శించారు. ఆస్ప‌త్రికి వచ్చే రోగులకు ఎక్కడా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వైద్యసేవలు సకాలంలో అందించాలని విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబును ఆదేశించారు. మందుల నిల్వల విషయంపై ఫార్మసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం సమావేశం మందిరంలో వైద్యులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబు విమ్స్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివ‌రించారు. మంత్రి గారు మాట్లాడుతూ త్వరలోనే విమ్స్‌లో ఖాళీగా ఉన్న స్పెషలిస్టు పోస్టుల భర్తీ చేపడతామని, ఇప్పటికే దీనికి సంబంధించిన జీవో సిద్దమైందన్నారు. ఆసుపత్రిలో సమస్యలు, విమ్స్‌ మెడికల్ కళాశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్‌తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. విమ్స్‌లో స్పెషలిస్టు డాక్ట‌ర్ల నియామ‌కానికి చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. ఒక్కొక‌రికి నెల‌కు రూ.1.6ల‌క్ష‌ల వేతనం చెల్లించేలా వైద్యుల నియామ‌కాల‌కు అనుమతులు కూడా మంజూరు చేశామ‌ని వివ‌రించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version