చంద్రబాబు గారూ…మీకు 2023 చివరి సంవత్సరం – విజయసాయిరెడ్డి

-

చంద్రబాబు గారూ…మీకు 2023 చివరి సంవత్సరం అంటూ చురకలు అంటించారు వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ పై మరోసారి స్పందించారు వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి.

vijayasai reddy on cbn

‘చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691…7+6+9+1=23. బాబు గారు… మీకు 2023 చివరి సంవత్సరం. 2024 నుంచి రాజకీయ యవనికపై ఇక కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్థం అయి ఉంటుంది మీకు’ అని ట్విట్ చేశారు.

ఇది ఇలా ఉండగా, టిడిపి అధినేత చంద్రబాబును ’23’ నంబర్ సెంటిమెంట్ వెంటాడుతోంది. 2019 ఎన్నికల్లో టిడిపికి 23 సీట్లు రాగా, చంద్రబాబు అరెస్ట్ అయిన తేదీ 9-9-23. ఆ అంకెలను కలిపితే మొత్తం 23 అవుతుంది. అలాగే రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నెంబర్ కేటాయించగా, వాటిని కూడితే 23 వస్తుంది. దీంతో ఆయనను 23 నెంబర్ వీడడం లేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా, చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలు లో ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version