మీడియాపై విజయసాయిరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు !

-

మీడియాపై విజయసాయిరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించినా ఆ పార్టీకి సలహాదారులుగా పనిచేసినవారికి మీడియాలో కాస్త ఎక్కువ ప్రచారం ఈమధ్య లభిస్తోంది. ఫలితాలు వెలువడిన రెండు మూడు రోజులకు ఆయా పార్టీల వ్యూహకర్తల గురించి పత్రికలు, న్యూస్‌ వెబ్సైట్లలో, న్యూస్‌ టెలివిజన్‌ చానల్స్‌లో కథనాలు వస్తున్నాయి. ఇలాంటి విషయాలు మీడియాలో వచ్చే ధోరణి భారతదేశంలో 2014 నుంచీ ఎక్కువైందని తెలిపారు. నాటి ప్రధాని, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన 1984 డిసెంబర్‌ నెలాఖరు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ‘రీడిఫ్యూజన్‌’ అనే అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఏజెన్సీ సేవలను కాంగ్రెస్‌ పార్టీ తొలిసారి వాడుకుందన్నారు.


ఇంగ్లిష్‌ సహా వివిధ భాషల్లో వెలువడే దినపత్రికల్లో కాంగ్రెస్‌ తరఫున పూర్తి పేజీ ప్రచార ప్రకటనలను ఈ ఏజెన్సీ రూపొందించింది. ఈ ఎలెక్షన్‌ యాడ్స్‌ పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కమ్యూనికేషన్ల రంగంలో వృత్తి నైపుణ్యం గల ప్రైవేటు సంస్థలకు ఎన్నికల ప్రచారంలో కొంత బాధ్యతను రాజకీయ పక్షాలు అప్పగించడం 1980ల మధ్యలో దేశంలో ఓ మోస్తరుగా ఆరంభమైంది. 1985 ఏప్రిల్‌ మాసంలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో కూడా నాటి జనతాపార్టీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఒక కార్పొరేట్‌ యాడ్‌ ఏజెన్సీ ద్వారా పత్రికల్లో వేసిన ఎన్నికల ప్రచార ప్రకటనలు రూపొందింపజేశారని తెలిపారు.

తాజాగా కర్ణాటక అసెంబ్లీ 16వ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచి అక్కడ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లు సాధించడానికి వెనుక ఉన్న వృత్తి నిపుణులు, మాజీ ఐఏఎస్‌ అధికారుల గురించి మీడియాలో వివరాలు వెల్లడిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది లేదా ఆరు నెలల ముందు నుంచి ఈ వ్యూహకర్తలు అధికార పార్టీపై ఎలాంటి నినాదాలు రూపొందించారు? ఎలాంటి జన సమీకరణ కార్యక్రమాలు అమలు చేశారు? వంటి వివరాలను ఈ మీడియా సంస్థలు పలు వ్యాసాల్లో చెబుతున్నాయి. మొదట ఫలానా పార్టీ ఈ కారణాల వల్ల ఓడిపోయిందని, ఫలానా ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఏఏ కారణాల వల్ల విజయం సాధించిందనే అంశాలను మీడియాలో పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. వివిధ రాజకీయపక్షాల గెలుపోటములకు ఇలా కారణాలు వివరించాక, విజయాల వెనుక ఉన్న వ్యక్తులు, వృత్తి నిపుణుల గురించి రాయడం గత పదేళ్ల నుంచి దేశంలో ఆనవాయితీగా మారిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version