ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటి పేరు “నారా “అన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అంటేనే విరుచుకుపడే వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు అదే “నారా” పదానికి కొత్త అర్దం చెబుతున్నారు. చంద్రబాబు నాసిరకం రాజకీయ నాయకుడు అని విమర్శించడం కోసం ‘నారా’ పదానికి ఎబ్రివేషన్ తయారు చేశారు. ‘నా’ అంటే నాసిరకం,’రా’ అంటే రాజకీయ నాయకుడు అట. అంటే చంద్రబాబు నాసిరకం రాజకీయ నాయకుడు అని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.
అందుకే చంద్రబాబు నాసిరకం రాజకీయ నాయకుడు అని ఆయన పేరులోనే ఉందని విజయసాయిరెడ్డి అంటున్నారు. చంద్రబాబును ఏపీ రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని.. చంద్రబాబు కి ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అర్హత కూడా లేదని.. అందుకే ఆయనను ఇక్కడి నుంచి తరిమి కొడితే తప్ప ఏపీ రాష్ట్రానికి భవిష్యత్తు లేదని కొత్త సూత్రీకరణ చెబుతున్నారు విజయసాయిరెడ్డి.
నా..రా అంటే నాసిరకం రాజకీయ నాయకుడు. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై కక్షకట్టాడు. బాధ్యతలేని
ప్రతిపక్ష నాయకుడు ఉన్మాది చంద్రబాబును ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి. కిక్ బాబు.. సేవ్ ఏపీ అన్నదే మన నినాదం.
2/3— Vijayasai Reddy V (@VSReddy_MP) May 27, 2022