2029 ఎన్నికలపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి పంపించాను అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో శ్రీ వైయస్ జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు.

నా రాజకీయ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా అంటూ వివరించారు. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో నా మరో ప్రస్థానాన్ని ప్రారంభించానని పేర్కొన్నారు.
ఇక అటు విజయసాయిరెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లడానికి హైదరాబాద్ సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 మధ్య 15 రోజులపాటు ఫ్రాన్స్, ఇంగ్లాండ్, నార్వే వెళ్లేందుకు అనుమతి తెలిపింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి పంపించాను.
2029 ఎన్నికల్లో శ్రీ వైయస్ జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను.
నా రాజకీయ…
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 31, 2025