విజయవాడ ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ బాలా త్రిపురసుందరీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వనుంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచీ అమ్మవారి దర్శనం ప్రారంభం అయింది. దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రి కి తరలి వస్తున్నారు అమ్మవారి భక్తులు.
ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని పశ్చిమ నియోజవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ..ఈ రోజు దసరా నవరాత్రి ఉత్సవాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులకు ఎంటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
గతంలో కొండ చర్యలు విరిగి పడకుండా చూస్తున్నామని.. ప్రతీ ఒక్కరికీ దర్శనం అందేలా చూస్తున్నామని వివరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు, కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ అన్ని రకాల చర్యలు తీసుకున్నారు…కేశఖండన, దుర్గా ఘాట్, కృష్ణ వేణి ఘాట్ లలో తగు జాగ్రత్తలు తీసుకున్నారన్నారు పశ్చిమ నియోజవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకొంటున్నానని చెప్పారు.