ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

-

నవంబర్​లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మూడు రాష్ట్రాల్లో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో 55 స్థానాలకు, మధ్యప్రదేశ్‌లో 144 మందితో, ఛత్తీస్‌గడ్‌ 30 మందితో మొదటి జాబితాలను కాంగ్రెస్‌ వెల్లడించింది.

మధ్యప్రదేశ్​లో 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కమల్​నాథ్​ను ఛింద్​వాఢా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్​ కుమారుడు జైవర్ధన్​ సింగ్​.. రఘీగథ్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు.

మరోవైపు ఛత్తీస్​గఢ్​లో 30 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను బరిలో నిలిపింది. మరోవైపు.. అంబికాపుర్ స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియోకు టికెట్ ఇచ్చింది. మధ్యప్రదేశ్​లో నవంబర్​ 17న, ఛత్తీస్​గఢ్​లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడతల్లో, తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఎలక్షన్స్​ జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3న వెలువడుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version