ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. శ్రీమహాలక్ష్మీదేవి రూపంలో దుర్గమ్మ

-

దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రి.. తెలంగాణలోని భద్రకాళీ అమ్మవార్ల సన్నిధిలో ఈ వేడుకలు శోభాయమానంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలను అధికారులు.. అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన నేడు.. దుర్గామాత.. శ్రీమహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి అని.. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్భుత ఘట్టమని ఆలయ అర్చకులు చెప్పారు. మూడు శక్తుల్లో ఒకటైన శ్రీమహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించిందని.. లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టి రూపమైన అమృత స్వరూపిణి అని తెలిపారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తాయనేది భక్తుల నమ్మకమని వివరించారు. ఇక దుర్గమ్మ సన్నిధిలో.. తెలవారుజామున 4 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆలయంలో నిర్వహిస్తున్న విశేష పూజలు, కుంకు మార్చనలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version