ఆంధ్ర ప్రదేశ్ తరహాలో తమిళనాడులోనూ గ్రామ సచివాలయాలు!

-

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రామ సచివాలయాల వ్యవస్థను తమ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ ప్రకటించారు.గ్రామ సచివాలయాల ఏర్పాటును విడతలవారీగా చేపట్టనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు.వీటిలో 600 సచివాలయాలు ఈ ఏడాదికి రానున్నాయి.ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో సీఎం స్టాలిన్ వెల్లడించారు.గ్రామ సచివాలయాలను మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తాం.ఇందులో సమావేశ మందిరం తో సహా అన్ని సౌకర్యాలు ఉంటాయని తెలిపారు.ఒక్కొక్కటి రూ. 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తామన్నారు.నవంబర్ 1 వ తేదీని ” స్థానిక పాలనా దినోత్సవం” గా జరుపుతామన్నారు.

ఏడాదికి గ్రామ సభలు నిర్వహించే సమావేశాలను 4 నుంచి 6 కు పెంచుతామని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తామన్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థ అమలులో ఉంది.దేశంలోనే మొదటిసారిగా గ్రామ సచివాలయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.2019 ఎన్నికల్లో విజయం సాధించింది.వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందచేయడానికి ప్రయత్నిస్తుంది.అయితే స్టాలిన్ పంచాయితీలకు సమాంతరంగా వీటిని ఏర్పాటు చేస్తూ కొత్తగా ఉద్యోగులను నియమించే ప్రయత్నం చేయడం లేదు.పంచాయతీల ఆధ్వర్యంలోనే పంచాయితీ ఉద్యోగుల తోనే నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version