కొత్త పార్లమెంట్ నిర్మాణంలో విశాఖ ఉక్కు పాత్ర !

-

విశాఖ ఉక్కు ఢిల్లీలో ఇటీవల ప్రారంభించిన పార్లమెంట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం ఓ పక్క ప్రయత్నాలు చేస్తున్నా… పార్లమెంట్ నిర్మాణానికి అవసరమైన మొత్తం 6వేల టన్నుల ఉక్కు విశాఖ ప్లాంట్ నుంచే వెళ్ళింది. భవన నిర్మాణం కోసం వినియోగించే 8 ఎంఎం నుంచి 24, 32 ఎంఎం వరకు స్టీల్ ఉత్పత్తులని పంపిణీ చేసినట్టు RINL వెల్లడించింది.

ఇది ఇలా ఉండగా,  కొత్త పార్లమెంట్‌.. ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది.. 140 కోట్ల భారతీయుల కల సాకారమైందని వెల్లడించారు. ఆధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్‌ అద్దం పడుతుంది.. ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం అన్నారు ప్రధాని మోడీ. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కొత్త పార్లమెంట్‌ను నిర్మించుకున్నాం.. ఇది కేవలం భవనం మాత్రమే కాదు.. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని స్పష్టం చేశారు ప్రధాని మోడీ. పవిత్రమైన సెంగోల్‌ను పార్లమెంట్‌లో ప్రతిష్టించాం.. భారత్‌ అభివృద్ధి చెందితే.. ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని వివరించారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version