విశాఖ తీరంలో అరుదైన పెట్టె.. 100 టన్నుల బరువు.. అందులో ఏముంది?

-

విశాఖ తీరంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. విశాఖ తీరంలో ఓ భారీ పెట్టె కొట్టుకుని వచ్చింది. దీని బరువు సుమారు వందటన్నులు ఉంది. పురతమైన చెక్క పెట్టే కావడంతో ప్రొక్లెనర్ తో ఒడ్డుకు చేర్చారు పోలీసులు. బీచ్ లో వున్న సందర్శికులు భారీ పెట్టెను చూసేందుకు రావడంతో పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బంది పడలిసి వచ్చింది.

Vizag Beach Mystery Wooden Box

వైఎంసిఏ బీచ్ లో కొట్టుకువచ్చిన భారీ ఆకృతి బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేస్తున్నారు. ఆర్కి యాలజీ విభాగంకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆ పెట్టెలో ఏ ముందనేది ఉత్కంఠగా మారింది. అయితే.. విశాఖ తీరానికి వచ్చిన ఆ భారీ పెట్టెను ఓపెన్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు బాంబ్‌ స్వ్కాడ్‌ ను రంగంలోకి దించారు. ప్రస్తుతం విశాఖ తీరంలో ఉన్న ఆ భారీ పెట్టెలో ఏముందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version