ఏపీ విభజన చట్టం లో భాగం గా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం రైల్వే జోన్ కు సంబంధించి సరైన ప్రకటన చేయలేదు. అయితే తాజా గా పార్లమెంట్ లో వైజాగ్ రైల్వే జోన్ పై కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ని ఇచ్చింది. లోక్ సభ లో బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ అడిగిన ప్రశ్న కు గాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.
దేశం లో ఇప్పటి కే 17 రైల్వే జోన్ లు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ప్రస్తుతం రైల్వే జోన్ లు ఎక్కువ గా నే ఉన్నందన కొత్త రైల్వే జోన్ లు ఏర్పాటు చేయలేమని ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ మేరకు కూడా కొత్త రైల్వే జోన్ లను ఏర్పాటు చేయలేమని తెలిపారు. అయితే కేంద్ర మంత్రి ప్రసంగం లో ఆంధ్ర ప్రదేశ్ అని.. అని వైజాగ్ రైల్వే జోన్ అని గాని ఎక్కడా ప్రకటించ లేదు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త గా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం లేదని తెలిపోయింది.