వైసీపీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వాలంటీర్లు..!

-

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన తెలిసిందే. అయితే తాజాగా వైసీపీ నాయకులపై వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ప్రధానంగా వైసీపీ నాయకులు తమ ఇళ్లకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఓ  వైసీపీ నాయకుడు తమతో రాజీనామా చేయించారని వాలంటీర్ల ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులు పై చర్యలు తీసుకోవాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు వాలంటీర్లు.

కోడ్ వచ్చిన తర్వాత మేము రాజీనామా చేయాలని వైసిపి నాయకులు ఒకటికి పది సార్లు ఫోన్లు చేసి వేధించారని వార్డు వాలంటీర్లు మీడియాతో పేర్కొంటున్నారు. అన్నీ మేము చూసుకుంటాం.. రాజీనామా చెయ్యండని.. రాత్రి వేళల్లో మా ఇంటికి వచ్చి బెదిరించారు. మాకు జరిగిన అన్యాయంపై వైసీపీ నేతలను ప్రశ్నిస్తుంటే పారిపోతున్నారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మమల్ని ఆదుకోవాలని కోరారు. వైసీపీ నాయకుల టార్చర్ తట్టుకోలేకె మేము రాజీనామా చేశామని వెల్లడించారు. ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version