AP Assembly : అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్..

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ తరుణంలోనే మొదటగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభం అయింది. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్బంగా సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ అయ్యారు. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు. గవర్నర్‌ వెళ్లేదారిలో బైఠాయించే ప్రయత్నం చేసారూ టీడీపీ సభ్యులు. ఈ తరుణంలోనే టీడీపీ సభ్యులను మార్షల్స్..అడ్డుకున్నారు. లాబీల్లో కూడా లాఠీఛార్జ్ చేస్తారా అంటూ టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

Walkout of TDP members from the assembly

కాగా, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ.. విజయవాడలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు.సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిందన్నారు. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసింది.. రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారని చెప్పారు. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించామని స్పష్టం చేసారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించాం. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.

Read more RELATED
Recommended to you

Latest news