కడపజిల్లా ప్రొద్దుటూరు కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రొద్దుటూరు లో రోజు రోజుకు రాజకీయం.. రంగు మారుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన ముగ్గురు కౌన్సిలర్లు తిరిగి వైసీపీ లో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో తిరిగి సొంత పార్టీలో చేరారు 8,39,40 వార్డు కౌన్సిలర్లు శాంతి, అనిల్, అరుణ. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడారు.

పార్టీ మారిన ప్రతి కౌన్సిలర్ ను ఆహ్వానిస్తున్నా అంటూ పేర్కొన్నారు. మనమందరం కలిసి పని చేద్దాం.. తిరిగి రండి అన్నారు. మా పార్టీ కౌన్సిలర్లను మరికొంత మందికి టీడీపీ వారు మభ్యపెట్టాలని చూస్తున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు.