విజయవాడ: గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరిస్తున్నాం అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతులకు మద్దతు ధర ప్రకటించి అమలు చేశాం అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 90 శాతం చెల్లింపులు చేశామన్నారు. 21 రోజులల్లోపే ధాన్యం సేకరణకు సంబంధించి సొమ్ములు చెల్లిస్తున్నాం అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కందిపప్పు బాగోలేదని చాలా మంది ఫిర్యాదు చేశారని.. బండి వద్దే కందిపప్పును ఉడకబెట్టి నాణ్యత పరిశీలించాలని ఆదేశించామన్నారు.
విచారణ కొనసాగుతోందని.. లోపాలు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ కార్డు దారులకు రాగులు, జొన్నలు తీసుకునే విషయమై వాలంటీర్లతో సర్వేలో చేశామన్నారు. మొదట రాయలసీమ జిల్లాల్లో పేదలకు రాగులు, జొన్నలు పంపిణీ చేసి.. దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా రాగులు, జొన్నలు పంపిణీ చేస్తామన్నారు.