సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటనలో భాగంగా తిరుచానూరులో ఇంటింటికి గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. సీఎన్జీ వాహనాలను పరిశీలించారు. పలువురు న్యాచురల్ గ్యాస్ లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఓ ఇంట్లో స్టవ్ వెలిగించి టీ చేసి సేవించారు. అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. గతంలో గ్యాస్ ఉచితంగా అందంచిన ఘటన టీడీపీదే అన్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్ లో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారుతుంది. కాలుష్య రహిత సమాజం నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 2014-19 మధ్య ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. దాదాపు 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతీ ఇంటికి పైపు లైన్ ద్వారా స్వచ్ఛమైన గ్యాస్ అందిస్తామని తెలిపారు. ఇంటింటికి గ్యాస్ అందించేందుకు 5 కంపెనీలను సంప్రదించినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. గోదావరి బేసిన్ లో 40 శాతం గ్యాస్ లభిస్తోందని వెల్లడించారు.