వరదల పై యుద్దం చేశాం.. యుద్ధంలో గెలిచాం : సీఎం చంద్రబాబు

-

వరదల పై యుద్దం చేశాం.. యుద్ధంలో గెలిచాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు గండ్ల పూడ్చివేతను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత దుర్మార్గ పాలన వల్లనే ఇంత కష్టపడాల్సి వచ్చిందన్నారు. బుడమేరును గత ప్రభుత్వం  పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు వచ్చాయని తెలిపారు. బుడమేరుకు పడిన గండ్లను పూడ్చేందుకు కొన్ని రోజుల నుంచి శ్రమిస్తూనే ఉన్నామని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో బుడమేరు పెద్ద ఎత్తున కబ్జాలకు గురైందని.. ఆ కారణంగానే విజయవాడ పట్టణం వరదలతో అతలాకుతలమైందని తెలిపారు. ఓ దుర్మార్గుని పాలన వల్ల లక్షలాది మంది ఇబ్బందుల పడ్డారు. దాతలు చాలా మంది ముందుకొస్తున్నారు. చాలా మంది సహకరిస్తున్నా.. వైసీపీ మాత్రం విషం చిమ్ముతుంది. బోట్లు వదిలి పెట్టి ప్రకాశం బ్యారేజీని డామేజ్ చేసే ప్రయత్నం చేసింది వైసీపీ. ఇంకా సిగ్గు లేకుండా వైసీపీకి సమర్ధించుకుంటోందని పేర్కొన్నారు చంద్రబాబు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version