ఉప ఎన్నికలొస్తే.. కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ఢీకొట్టగలదా..?

-

అధికారం కోల్పోయి.. నిరాశలో ఉన్న బీఆర్ఎస్ కు జంపింగ్ లు కహాని కలవరపాటుకు గురిచేసింది.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలంటూ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లింది.. ఈ క్రమంలో పార్టీ మారిన దానం నాగేంద‌ర్‌, తెల్లం బాల‌రాజు, క‌డియం శ్రీహ‌రిలపై తెలంగాణా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ మేర‌కు స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ వ్యవహారం బీఆర్ ఎస్ కు బూస్టప్ ఇచ్చినట్లే అయింది..

తెలంగాణాలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.. క్యాడర్ సిద్దంగా ఉండాలని ఆ పార్టీ అగ్రనేతలు పిలుపుస్తున్నారు.. కాంగ్రెస్ మీద, గోడ దూకిన ఎమ్మెల్యేల మీ పైచెయ్యి సాధించామని బీఆర్ ఎస్ నేతలు సంబర పడుతున్న వేళ.. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ధాటికి తట్టుకోగలమా..? స్థానాలను చేజిక్కించుకోగలమా అనే ప్రశ్న వారిని నిద్రపట్టనివ్వడం లేదట.. ఎన్నిక‌లు జ‌రిగి 10 మాసాలైంది. ఈ ప‌ది నెల‌ల‌లో బీఆర్ ఎస్ ఎక్క‌డా పుంజుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ ఎక్కడా ప్రభావం చూపిన దాఖల్లేవ్. ఈ సమయంలో ఉపఎన్నికలు వస్తే.. పార్టీ ఉనికికే ప్రమాదమని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు..

రాజకీయ వ్యూహ కర్తగా ఉన్న కేసీయార్ జనాల్లోకి వచ్చి చానాళ్లవుతోంది.. పార్టీ వాయిస్ ను కేటీఆర్, హరీష్ వినిపిస్తున్నా.. పార్టీ బలపడిన సందర్బాలులేవ్.. ఈ సమయంలో ఎన్నికలు వస్తే పార్టీకి డ్యామేజ్ తప్ప.. లాభం లేదనే వాదన వినిపిస్తోంది.. మరో పక్క అధికార పార్టీ దూకుడు మీదుంది.. ఇచ్చిన హామీలను అమలు చెయ్యడంతో పాటు.. హైడ్రా వంటి సంచలన నిర్ణయాలు తీసుకుని ప్రజల్లో పాజిటివ్ సంపాదించుకుంది.. ఇప్పుడు కాంగ్రెస్ ను ఢీకొట్టడం అంత ఈజీ కాదనే భావన గులాబీ పార్టీలో ఉందట..ఉప ఎన్నికలు వస్తే సత్తా చాటుతామని పైకి చెబుతున్నా.. లోలోన ఆ పార్టీ నేతలు వణికిపోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version