టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇంకా అమలు చేయలేదని ఈ చట్టం మీద అడ్వకేట్స్ కొన్ని అభ్యంతరాలు చెప్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో త్వరితగిన రీసర్వే పూర్తి అవుతుందని ఆయన అన్నారు. ఇంకా రూల్స్ తయారు చేయలేదని చెప్పారు. అసెంబ్లీ చర్చించలేదని న్యాయవాదులు సలహా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
ఆదరాబాదరాగా ఇలా టైటిలింగ్ యాక్ట్ ని ప్రభుత్వం అమలు చేయదని చెప్పారు దేశం మొత్తం చట్టం అమలు జరుగుతుందని సరైన టైటిల్ లేక పోయిందంటే ధనవంతులు చేతికి బీదల భూములు వెళ్ళిపోతాయని అన్నారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు ముఖాముఖి మాట్లాడ్డానికి అభ్యంతరం లేదని అన్నారు. న్యాయవాదులు విధులకు హాజర అవ్వాలని కోరుతామని చెప్పారు.