రొట్టెల పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం : సీఎం చంద్రబాబు

-

నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన రొట్టెల పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. రొట్టెల పండుగ వద్ద భక్తులతో సచివాలయం నుండి సీఎం చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బారాషహీద్ దర్గా చరిత్ర చాలా గొప్పదని అన్నారు. భక్తులు నమ్మకం మరింత గొప్పదన్నారు.

బారా షాహీ దర్గా అంటే తనకు కూడా నమ్మకమని పేర్కొన్నారు. రొట్టెలు పంచుకోవడం, కోర్కెలు తీరడం, ప్రార్ధనలు చేయడం భాగంగా రొట్టెల పండుగ గొప్పదని పేర్కొన్నారు. సర్వమత సమ్మేళనాన్ని ఇక్కడ చూడవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాకెట్ లాంచ్ చేయాలన్నా దేవుడిని ప్రార్ధించి చేస్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎవరికి నమ్మకమైన దేవుడిని, వారు ప్రార్ధించాలని సీఎం పేర్కొన్నారు. రొట్టెల పండుగ నిర్వహణ కోసం ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు నిధులు కేటాయించిందని.. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉందని… సంపద సృష్టిస్తామనే నమ్మకం ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని.. ఖజానా నిండాలని ఆరు రొట్టెలు వదలాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version