రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ..!

-

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వుల జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు హైడ్రా అధికార పరిధిల విస్తరించి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘హైడ్రా’కు చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఇందులో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ కు చెందిన జిల్లా మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ మేయర్ సభ్యులుగా కొనసాగనున్నారు.

revanth

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలను పరిరక్షించడం, నాలాలు, సర్కారు భూములు, స్థిరాస్థులు కబ్జాకు గురికాకుండా ‘హైడ్రా’ నిరంతరం పర్యవేక్షించనుంది. అదేవిధంగా పెద్ద పెద్ద హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, వాటర్ పైపులైన్లు, కరెంట్ సప్లై లైన్లు, డ్రైనేజీ, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ లాంటి సేవల్లో ఇక నుంచి ‘హైడ్రా’ భాగస్వామ్యం కానుంది. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 మేజర్ పంచాయతీల వరకు ‘హైడ్రా’ అధ్వర్యంలో కొనసాగుతాయి. ఈ సంస్థకు డీఐజీ స్థాయి అధికారి డైరెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులు అదనపు డైరెక్టర్లుగా నియమించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version