ఆంధ్రప్రదేశ్ లో కూటమి నేతలకు కొందరూ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా విజయవాడలోని జిల్లా జైలులో వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీని తప్పుడు కేసులో ఇరికించారని తెలిపారు. పోలీసులు టీడీపీ నేతలకు కాకుండా టోపీ పై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టండి. టీడీపీ నేతలకు సెల్యూట్ కొట్టి, వారు చెప్పినట్టు చేసి అన్యాయం చేస్తే.. మాత్రం బాగోదు. రేపు మళ్లీ అధికారంలోకి వస్తాం.
వంశీని అరెస్ట్ చేసి సీఐ అన్నాడట.. రిటైర్డ్ అయ్యాక సప్త సముద్రంలో ఉన్నా కూడా అన్యాయం చేసిన అధికారులందరి బట్టలు ఊడదీసి నిలబెడతాం అన్నారు. ఎవ్వరినీ వదిలిపెట్టం. రిటైర్డ్ అయినా.. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తామని వార్నింగ్ ఇచ్చారు. అన్యాయం చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం. పారిశ్రామికవేత్తలను, రాజకీయ నేతలు వీళ్లే బెదిరిస్తారు. ప్రజాస్వామ్యం కూలిపోతుందనడానికి ఇదే నిదర్శనం. పిడుగురాల్ల, పాలకొండ, తుని మున్సిపాలిటీలలో టీడీపీ రాజకీయం చేస్తోంది.