ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. వంశీ అరెస్ట్ రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోంది. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని.. గన్నవరం టీడీపీ ఆఫీస్ లో పని చేస్తున్న సత్యవర్ధన్ చెప్పారు. కానీ పోలీసులు పెట్టిన కేసు ఏంటి..? వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు.
వల్లభనేని వంశీ నెలల తరబడి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని తెలిపారు. పోలీసులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు టీడీపీ నేతలకు కాకుండా మీ టోపికి కనిపించే సింహాలకు సెల్యూట్ కొట్టండి. అన్యాయం చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతాం అన్నారు. సప్త సముద్రాలు దాటినా ఎక్కడున్నా.. అన్యాయానికి శిక్ష పడేలా చేస్తామని జగన్ హెచ్చరించారు. తన సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతున్నారంటే చంద్రబాబు, లోకేష్ తట్టుకోలేరన్నారు. కొడాలి నాని, దేవినేని అవినాష్, బ్రహ్మ నాయుడు ఇలా ఎవరైనా ఎదిగితే.. వారిపై ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారని తెలిపారు.