త్వరలోనే పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తామని ప్రకటన చేశారు సీఎం జగన్. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం వల్ల మావోయిస్టుల ప్రభావం తగ్గిందని..మనస్సులను గెలుచుకోవడం ద్వారా శాంతి భద్రతలను పరిరక్షించుకోవచ్చని తెలిపారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఉండాలనేది నా మనస్సులో మాట అని.. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత కారణంగా వీక్లీ ఆఫ్ అమలు చేయలేకపోయామని వెల్లడించారు.
దీన్ని దృష్టిలో పెట్టుకునే 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని.. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. పోలీసులు ప్రజల కోసం ప్రాణాలొడ్డి విధులు నిర్వహిస్తారని.. పోలీస్ వ్యవస్థకు సమాజం అండగా ఉంటుందన్నారు.
విధి నిర్వహణలో ఉంటూ ఏపీలో 11 మంది పోలీసులు చనిపోయారు…పోలీస్ శాఖలో సిబ్బంది కొరత తగ్గించనున్నాం.. పని ఒత్తిడి తగ్గిస్తామని చెప్పారు. 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం… గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో రిక్రూట్మెంట్ చేయలేదని వెల్లడించారు. హోం గార్డుల గౌరవ వేతనం పెంచాం.. 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీలో హోం గార్డులకు రిజర్వేషన్ ఉందన్నారు. 16 వేలకు పైగా గ్రామ మహిళా పోలీసులను నియమించాం..1.33 కోట్ల ఫోన్లల్లో దిశా యాప్ డౌన్ లోడ్ అయిందని పేర్కొన్నారు సీఎం జగన్.