AP: వైద్యం కోసం మహిళ వస్తే.. ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేయడం లాంటివి చేశాడు ఓ ఫిజియో థెరఫిస్ట్. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియో థెరఫి కోసం వచ్చిన మహిళ తో ఫిజియో థెరఫిస్ట్ అసభ్య ప్రవర్తన చేశాడు.

ఈ తరుణంలోనే.. ఫిజియో థెరఫిస్ట్ పై సీరియస్ అయింది సదరు మహిళ. అక్కడితో ఆగకుండా… ఫిజియో థెరఫిస్ట్ పై ఆసుపత్రి సూపరింటెండ్ కు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రియాక్ట్ అయ్యారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్. ఈ సంఘటనపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్.