జూమ్ మీటింగ్ లో తాము మాట్లాడిన దానిని చూపించడానికి లోకేష్ కు భయమేంటి?: వల్లభనేని వంశీ

-

పదవ తరగతి విద్యార్థులతో టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అయితే జూమ్ మీటింగ్ నడుస్తుండగానే వైసీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని ఎంట్రీ ఇచ్చిన వ్యవహారంపై ఆసక్తి రేపింది. వాళ్ళిద్దరు సడన్ ఎంట్రీ ఇవ్వడం పై టిడిపి నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ఫేక్ పార్టీ కాబట్టే.. ఆ పార్టీ నేతలు ఫేక్ ఐడిలతో జూమ్ మీటింగ్ లోకి వచ్చారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దమ్ముంటే నేరుగా వచ్చి తనతో మాట్లాడాలని కూడా లోకేష్ వారికి సవాల్ విసిరారు. ఈ వ్యవహారంపై టిడిపి ఏపీ చీఫ్ అచ్చన్నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై తనను కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దొంగల్లా కాకుండా నేరుగా తమ వద్దకు వచ్చి మాట్లాడాలని లోకేష్ సవాలు చేస్తున్నారని మీడియా ప్రస్తావించగా.. తాము వెళ్లి చర్చిస్తే లోకేష్ మాట్లాడగలరా? అంటూ ఆయన స్పందించారు.

అయినా తామేమి జూమ్ మీటింగ్ లోకి దొంగల్లా ప్రవేశించ లేదని. చాలా మందిని ఆహ్వానించిన తర్వాతే మీటింగ్ పెట్టారు కదా.. అందులో గత ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఏమిటో చెప్పేందుకు ప్రవేశించామని వంశీ అన్నారు. అయినా టెన్త్ విద్యార్థులకు ధైర్యం చెప్పాల్సిన లోకేష్.. అందుకు విరుద్ధంగా తమ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు అని వంశీ చెప్పారు. జూమ్ మీటింగ్ లో తాము మాట్లాడిన దానిని చూపించడానికి లోకేష్ కు భయం ఏంటి? అని కూడా వంశీ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version