హడలెత్తిస్తోన్న మంకీపాక్స్.. వెయ్యికిపైగా కేసులు నమోదు..!!

-

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 29 దేశాలకు ఈ వైరస్ పాకింది. దాదాపు వెయ్యికిపైగా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ అన్నారు. వైరస్‌ను కట్టడి చేయడానికి.. వైరస్ సోకిన బాధితుల సన్నిహితులను గుర్తించాలని అన్నారు. అందరినీ ఒకే దగ్గర ఉంచి.. చికిత్స అందజేయాలన్నారు. కొన్ని దేశాల్లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కేసులు నమోదవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

మంకీపాక్స్

మంకీపాక్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ పలు సూచనలు తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తితో కుటుంబసభ్యులు దూరంగా ఉండాలన్నారు. మంకీపాక్స్ ను నియంత్రించడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని, కానీ తక్కువ పరిమితిలో సరఫరా ఉందన్నారు. పలు దేశాల్లో మంకీపాక్స్ కు టీకాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, మంకీపాక్స్ వ్యాక్సిన్ చిన్న పిల్లలకు, గర్భిణులకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వేయనున్నట్లు తెలిపారు. మంకీపాక్స్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, చర్మంపై దుద్దర్లు, వెన్నునొప్పి సమస్యలు వస్తాయన్నారు. అలాంటి సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version