సాధారణంగా మనం జరిగే రోడ్డు ప్రమాదాలను పరిశీలించినట్టయితే కొంత మంది హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ప్రాణాలను కోల్పోతున్నారు. హెల్మెట్ ధరించాలని పోలీస్, రవాణా శాఖ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా వాటిని ఎవ్వరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు. దీంతో తాజాగా ఏపీ హైకోర్టు సైతం సీరియస్ అయింది. హెల్మెట్ తప్పనిసరిగ్గా ధరించాలనే నిబంధనను అమలు చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవడం లేదని ధర్మాసనం పేర్కొంది.
ముఖ్యంగా 2024 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల దాదాపు 667 మంది మరణించారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీనికి ఎవ్వరూ బాధ్యత వహిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ట్రాఫిక్ విభాగంలో 8వేల మంది సిబ్బంది అవసరం కాగా.. ప్రస్తుతం కేవలం 1800 మంది మాత్రమే ఉన్నారని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఫైన్ విధించినా వాహనదారులు చెల్లించడం లేదన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం రవాణా శాఖ కమిషనర్ ను సుమోటోగా ఇంప్లీడ్ చేసి.. వారం లోపు కౌంటర్ వేయాలని ఆదేశించి కోర్టు.