బాలయ్య అఖండ-2 విడుదల తేదీ వచ్చేసిందోచ్..!

-

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దానికి సీక్వెల్ గా అఖండ-2 మూవీని తెరకెక్కిస్తున్నారు బోయపాటి. తాజాగా ఈ సినిమా విడుదల కి సంబంధించిన డేట్ ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది 2025 దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది.
ఈ రిలీజ్ డేట్ ప్రోమోలో బాలయ్య సినిమా లాంఛ్ సమయంలో చెప్పిన డైలాగ్ ని చూపిస్తూ, పవర్పల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజికు ప్లే చేసింది. 

నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’ తాండవం. రీసెంట్ గానే  ఈ చిత్రం గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. అయితే, ఈ సీక్వెల్ కి సంబంధించి  మూవీటీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపింది. అలాగే రిలీజ్ డేట్ ప్రోమోను కూడా విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version