మందుబాబులకు శుభవార్త… అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్ ఓపెన్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మందుబాబులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో మందు బాబులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Wines are open till 12 midnight

డిసెంబర్ 31వ తేదీ మరియు జనవరి ఒకటో తేదీలలో రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని తెలిపింది. బార్లు క్లబ్బులు పర్మిషన్తో జరిగే ఈవెంట్లలో ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఎక్సైజ్ శాఖ. దీంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news