ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఏపీ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగింది. గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుతోంది. 2022 నుంచి 23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి పెరిగిపోయింది.
జాతీయ తలసరి ఆదాయం కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం 47,518 రూపాయలు ఎక్కువగా నమోదు అయింది. జాతీయ సగటు తలసరి ఆదాయం లక్ష 72 వేల రూపాయలు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం 2.19 లక్షల రూపాయలు. అలాగే గత మూడు సంవత్సరాలుగా ఆదాయ పనులు చెల్లింపు దారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా పార్లమెంట్ వేదికగా తెలిపారు.