ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో భేటీ కానుంది ఏపి కేబినెట్. ఈ సందర్భంగా ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన పారిశ్రామిక ప్రతిపాదనలకు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. రూ.44,776 కోట్ల తో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంప్డ్ స్టోరేజి, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో సవరించిన రిజిస్ట్రేషన్ విలువల కు ఆమోదం తెల్పనుంది కేబినెట్… 22 ఏ ఫ్రీ హోల్డ్ భూముల పై ఆయా జిల్లాలలో స్టేటస్ నోట్ ను మంత్రివర్గానికి సమర్పించనున్న మంత్రులు… ఉగాది నుంచి పీ 4 విధానం అమలు అంశం పై కేబినెట్ లో చర్చ చేసే అవకాశం ఉంది. ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసే అంశంపై కేబినెట్ లో చర్చ జరుగనుంది. సాంకేతిక విద్య, ఐసెట్,లాసెట్ లాంటి పరీక్షల నిర్వహణను అప్పగించేలా ప్రతిపాదనలు రానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహణ పైనా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది.