పద్మావతి మహిళా వర్శిటి మహిళ సాధికారత సమావేశంలో ఇవాళ మంత్రి రోజా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మహిళ పక్షపాతి సీఎం జగన్ అన్నారు. చరిత్రలో ఎవరు చేయని విధంగా మహిళల కృషి చేస్తున్నారు. లక్షలాది కోట్లు మహిళల అకౌంట్స్ నేరుగా డబ్బులు వేస్తున్నారు. పాలు ఇచ్చే స్థాయి నుంచి పాలించే స్ధాయికి దేశంలో మహిళలు ఎదిగారని తెలిపారు. 33శాతం రిజర్వేషన్ల ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.
రిజర్వేషన్ల ఇవ్వకుండానే ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించిన ఘనత మహిళలది. విద్య,సినిమా,రాజకీయాలు ఎక్కడైనా సరే ..మహిళలను వెనక్కి తరిమేసిలా ప్రయత్నం చేస్తుంటారు .మనం చేస్తూన్న పని తప్పా, ఒప్పా అని మనకు తెలుస్తే చాలు. మహిళలు విమర్శలకు భయపడి పారిపోకూడదు..పోరాటం మాత్రమే చేయాలీ. ఒక మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది కాని ఒక స్త్రీ విజయం వెనుక ఒక స్త్రీ నే ఉంటుంది.లింగ వివక్షత అనేది సమాజంలో ఉండకూడదు. కొత్త జనరేషన్ యువతరం దాన్ని మార్చాలి. సినిమా వాళ్ళు బ్లూ ఫిలింలు చేస్తారని ఒక పనికి మాలిన యదవ మాట్లాడు. మనం చేస్తున్న పని తప్ప కాదా అని మనకు తెలిస్తే చాలు అన్నారు. మన మనసాక్షికి తెలిస్తే చాలు..ఎవరో ఎదో తిట్టారని భయపడి వెనక్కి అడుగు వేయకుండా ముందుకెళ్ళాలీ.మహిళల కోసం ఎంతో పోరాటం చేశాను.. ఉద్యమాలు చేశాను అని తెలిపారు మంత్రి రోజా.