సీఎం చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డిలపై యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్… విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తూ X లో ట్వీట్ చేసిన యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్… చంద్రబాబు గారు తెలంగాణలో ఉన్న మీ శిష్యుడి ప్రభుత్వం శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తుందని ఆగ్రహించారు.
ఎడమ విద్యుత్ కేంద్రంలో యదేచ్చగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. మన రాష్ట్రానికి దిగువన నీటి అవసరాలు ఉంటే తెలంగాణ 35,315 క్యూసెక్కుల నీటిని తరలిస్తుంటే చోద్యం చూస్తున్నారా..? సీఎం చంద్రబాబు నాయుడు అంటూ Xవేదికగా ట్వీట్ చేశారు ఎమ్మెల్యే చంద్రశేఖర్. మరి దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.