వారంలో రెండు సార్లు.. తెలంగాణ లీడర్ల లేఖలపై షాక్ ఇచ్చింది టీటీడీ పాలక మండలి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన టీటీడీ.. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖలను స్వీకరిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని పేర్కొన్నారు టీటీడీ ఈవో శ్యామల రావు.
వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజాప్రతినిదుల లేఖలు స్వీకరిస్తారని మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు టీటీడీ ఈవో శ్యామల రావు.
భక్తుల వద్ద నుంచి సలహాలు, పిర్యాదులు స్వీకరించిన టీటీడీ ఈవో శ్యామల రావు… తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిపార్సు లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని అన్ని ఏర్పాటు పూర్తి చేశామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తున్నామని పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల నిమిత్తం ఆన్లైన్ లో 1 లక్ష 40 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కేటాయించామని తెలిపారు.