టీడిపి, జనసేన ,బిజెపిలకు హనీమూన్ నడుస్తుందంటూ ఎద్దేవా చేశారు మాజీ సీఎం జగన్. వైసీపి ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. 40 శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారు…మర్చిపోవద్దని… మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తు ఉందని తెలిపారు.
ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని… EVM ల వ్యవహారం పై దేశ వ్యాప్త చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మనకు కష్టాలు కొత్త కాదు… ప్రలోభాలకు లొంగకుండా ప్రజల తరఫున పోరాడదామని పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్. నాలుగైదు కేసులు పెట్టినంత మాత్రం భయపడవద్దన్నారు. మళ్ళీ వైసిపి ఉవ్వెత్తున ఎగసి పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. శిశుపాలుని మాదిరిగా చంద్ర బాబు తప్పులు లెక్క పెట్టాలని తెలిపారు మాజీ సీఎం జగన్.