అసెంబ్లీ ఎన్నికల కోసం నియోజకవర్గ ఇన్చార్జ్ లను మారుస్తూ ఓవైపు కసరత్తు చేస్తున్న వైసీపీ…. మరోవైపు ఎన్నికల సమరానికి శంఖారావం పూరించనుంది. ఈ నెల 27న విశాఖ-విజయనగరం జిల్లాల మధ్య భారీ బహిరంగసభ నిర్వహించనుంది. సీఎం జగన్ పాల్గొనే ఈ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. రెండు రోజుల్లో వేదిక ప్రాంతాన్ని ఖరారు చేయనుండగా…. భీమిలి పరిధిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇక అటు ఏపీలో ఎన్నిక నిర్వాహనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% పైగా వైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ముందే 12D వారం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని అధికారులు పరిశీలించి ఓట్ ఫ్రమ్ హోం అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ విధానాన్ని ఈసీ విజయవంతంగా అమలు చేసింది.