వైసీపీ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు అయ్యాడు. వేముల పోలీస్ స్టేషన్ లో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి పులివెందులకు తరలించారు పోలీసులు. పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాలలో రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.
వేముల మండలంలో రైతులను తాసిల్దార్ కార్యాలయంలోనికి వెళ్లనికుండా టిడిపి కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆయన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే మీడియాపై దాడి జరగడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కార్యకర్తలను తాసిల్దార్ కార్యాలయం నుంచి బయటికి పంపే వరకు తాను కూడా కదలనని పోలీస్ స్టేషన్ లోనే భీష్మించుకుని కూర్చున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. దీంతో వేముల పోలీస్ స్టేషన్ లో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి పులివెందులకు తరలించారు పోలీసులు.