బోరుగడ్డ అనిల్‍ కు బిర్యానీలు… 7 గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు !

-

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‍ కు బిర్యానీలు తినిపించిన… 7 గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు పోలీసులు రాచ మర్యాదలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో గన్నవరంలోని ఓ రెస్టారెంట్‌లో విందు భోజనం చేశారు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‍.

YCP leader Borugadda Anil police courtesy

అయితే.. ఈ సంఘటనను టీడీపీ కార్యకర్తలు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తుండగా.. ఫోన్ లాక్కుని వీడియో డిలీట్ చేశారట పోలీసులు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై ఇష్టారీతిన మాట్లాడిన అనిల్‌కు ఇలా మర్యాదలు జరగడం ప్రశ్నార్థకంగా మారిందని కొంత మంది అంటున్నారు. అయితే…ఈ సంఘటనలో ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది బాబు సర్కార్‌. రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‍ను రెస్టారెంట్‍కు తీసుకెళ్లిన పోలీసులపై వేటు వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version