పవన్ కల్యాణ్‌ను అరెస్టు చేయాల అంటూ వైసీపీ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అరెస్టు చేయాలని వైసీపీ నేత కె. వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన పవన్.. బైక్ సైలెన్సర్లు తీసి యువకులు స్టంట్లు చేయాలని సూచించారని ఆరోపించారు.
‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు వెళ్లొస్తూ ఇద్దరు యువకులు చనిపోయారని, వారి మృతికి కారణమైన పవన్ కల్యాణ్‌ను అరెస్టు చేయాలన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇది ఇలా ఉండగా… రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకులకు అండగా నిలిచారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దిల్ రాజు చెరో 5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. తాజాగా చెరో 5 లక్షల ఆర్థిక సాయాన్ని అనౌన్స్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.