BREAKING : వైసీపీకి ఎమ్మెల్యే రాజీనామా

-

వైసీపీలో మరో ఎమ్మెల్యే సంచలన ప్రకటన చేసారు. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పులో భాగంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి టికెట్ నిరాకరించారు. అనంతపురం జిల్లాలో చేస్తున్న మార్పుల్లో భాగంగా రాయదుర్గం సీటు మారుస్తున్నట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చారు. దీంతో క్యాంపు కార్యాలయానికి చేరుకున్న రామచంద్రారెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలతో సమావేశమయ్యారు. సీటు రాదని తేలటంతో స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి దిగుతాని కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు.

వైసీపీ ఇంఛార్జ్ ల మార్పులతో ఎమ్మెల్యేలు ఆక్రోశానికి గురవుతున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి కొనసాగుతున్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి సీటు నిరాకరించారు. 2009, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాపు రామచంద్రారెడ్డి గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో సర్వే నివేదికలు వ్యతిరేకంగా ఉండటంతో సీటు ఇవ్వటం లేదని పార్టీ నాయకత్వం సమాచారం ఇచ్చింది. భవిష్యత్ లో మరో విధంగా ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం కాపు రామచంద్రారెడ్డి తన భార్య, కుమారుడుతో క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీఎంతో కలవాలని ప్రయత్నించారు. కానీ, ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం దక్కలేదని కాపు రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. నమ్మినందుకు గొంతు కోశారు.  నేను రాయదుర్గం నుంచి, నా భార్య కళ్యాణ దుర్గం నుంచి ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నాం. ఇలా చేస్తారని ఊహించలేదు. మా ఇంట్లో వైఎస్సార్ ఫోటో లైట్స్ వేసి ఉంటుంది

Read more RELATED
Recommended to you

Exit mobile version