వివేకానంద హత్యపై వైసీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు !

-

మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డిని పరలోకానికి పంపింది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి అనుచరులేనని రఘురామకృష్ణ రాజు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తుంటే తనకుఒక కథ గుర్తుకు వస్తుందని, న్యాయస్థానంలో ఒక నిందితుడు తాను తండ్రి లేని వాడిని క్షమాబిక్ష పెట్టమని న్యాయమూర్తి గారిని అభ్యర్థించారట… దానికి పక్కనే ఉన్న వ్యక్తి, తండ్రిని హత్య చేసిన కేసులో నిందితుడిగా వీడు బోన్లో నిలబడ్డాడని చెప్పినట్లుగా… మీ చిన్నాన్న గారిని రాజకీయంగా నిరాశ్రయున్ని చేసింది మీరేనని, మీకు సంబంధం లేకపోయినా వై.యస్. వివేకానంద రెడ్డిని పైకి పంపించింది మీవాళ్లేనని సీబీఐ అంటోందన్నారు.

మీ చెల్లెల్ని కూడా తమ వైపు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబంలో చిచ్చు పెట్టిందని చెప్పడం విడ్డూరంగా ఉందని, వై.యస్. షర్మిల గారు మీకోసం కాళ్లు అరిగేలా తిరిగిరాని, కానీ ఆమెకు మీరు ఎటువంటి పదవి ఇవ్వలేదని అన్నారు. కడప లోక్ సభ పార్టీ టికెట్ తనకు కాదు… షర్మిల గారికి ఇవ్వమని వివేకానంద రెడ్డి గారు కోరినప్పటికీ షర్మిల గారికి పార్టీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఒకవేళ షర్మిల గారిని రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకుంటే, మరి ఆమెతో మీరు ఎందుకు పాదయాత్రలు చేయించారు??, మీ బావ గారిని ఎందుకు చర్చిల చుట్టూ తిప్పారు? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version